షిరిడీ వాస సాయిప్రభో- జగతికి మూలం నేవె ప్రభో
దత్త దిగంబర అవతారం - నీలో సృస్టికి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓసాయీ -కరుణించు కాపాడోయీ
దరిశనమీయగరావయ్యా- ముక్తికిమార్గం. చూపవయ్యా "షిరిడీ. "
కఫినీ వస్త్రము ధరియించి - భుజమునకు జోలి తగిలించి
నింబవృక్షపు ఛాయలలొ - ఫకీరువేషపు ధారణలో
కలియుగమందున -వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామంనీ వాసం - భక్తుల మదిలోనీరూపం "షిర్డిడీ "
చాంద్ పాటిల్ ను కలుసుకొని -అతన బాధలు తెలుసుకొని
గుర్రము జాడ తెలిపితివి - పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను - నీవు వుపయొగించి ఆ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం -చూసి వింతైన ఆ దృశ్యం " షిరిడీ "
బాయిజా చేసెనునీ సేవ - ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి - తాత్యాను నీవు బ్రతికించి దేవా
పసుపక్షులను ప్రేమించి - ప్రేమతొ వాటిని లాలించి
జీవులపైన మమకారం - చిత్రమయా నీ వ్యవహారం " షిరిడీ "
నీ ద్వారములొ నిలచితి - నిన్నె నిత్యము కొలచితిని.
అభయమునిచ్చీ బ్రోవుమయ్య -ఓ షిరిడీ వాస దయా మయా
ధన్యము ద్వారక ఓ మాయీ - నీలో నిలచెను శ్రీసాయీ
నీ ధుని మంటల వేడిమికి - పాపము పోవును తాకిడికి "షిరిడీ "
ప్రళయకాలము ను ఆపితివి -భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీనాశం - కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రిశాస్త్రీకి -లీలమహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి - పామువిషము తొలగించి -"షిర్డి "
భక్త భీమాజీకి క్షయ రోగం - నశియించె అతని సహనం
వూదీ వైద్యం చేశావు - వ్యాధిని మాయం చేశావు
కాకాజీకి ఓ సాయి - విఠలా దర్శనమిచ్చితివి
దాముకిచ్చిన సంతానం - కలిగించితివీ సంతోషం "షిరిడీ "
కరుణాసింధు కరుణించు - మాపఇచ్చావ కురిపించు
సర్వం నీకేఅర్పితము - పెంచుము భక్తిభావమును
ముస్లిం అనుకొని నిను మేఘా - తెలుసుకొనీ అతనీ భాధ
దాల్చీశివశంకరరూపం - ఇచ్చావయ్యా దర్శనము. "షిరిడి "
డాక్ట్టరు కు నీవు రామునిగా - బల్వంతునకు శ్రీ దక్థునిగ
నిమోను కర్ కు మారుతిగా - చిదంబరకు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా - గణూకు సత్యా దేవునిగ
నరసింహ స్వామిగా జ్యొషీకి - దర్సనమిచ్చిన శ్రీ సాయి. " షిరిడి "
రేయీ పగలూ నీ ధ్యానం - నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చెయ్యండి ధ్యానం - లభించును ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలూ - బాబా మాకవి వేదాలూ
శరణని వచ్చిన భక్తులను - కరుణించి నీవు బ్రోచితివి " షిరిడి "
అందరిలోన నీరూపం - నీ మహిమా అతిశక్తి మయం
ఓ సాయి మేము మూఢులము - ఒసగుమయా నీవుజ్ఞానమును
సృష్టికి నేవె నయమూలం - సాయీ మేము సేవకులం
సాయి నామం తలచెదము - నిత్యం సాయిని కొలచెదము " షిరిడి "
భక్తి భావన తెలుసుకొని - సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం - చెయ్యలండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధునిఊది - నివారించును అది వ్యాధి
సమాధినుండీ శ్రీ సాయి - భక్తులను కాపాడవోయి " షిరిడి "
మనప్రశ్నలకు జవాబులు -తెలుపును సాయీ చరితములు
వినండి లేకచదవండి - సాయీ సత్యము చూడండి
సత్సంగమునూ చెయ్యండి సాయీ స్వప్నము పొందండి
భేధభావమును మానండి -సాయీ మనసద్గురువండి. " షిరిడి "
వందనమయ్యా పరమేశా -ఆపత్భాంధవ సాయీశా
మా పాపములు కడతేర్చు - మా మది కోరిక నేరవేర్చు
కరుణా మూర్తీ ఓ సాయీ - కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము - మా పలుకులే నీకు నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారజ్ కి జై. " షిరిడి "
Sent from my iPad

Good work peddamma! 👍🏻
ReplyDelete