Monday, 19 September 2016

దసరా నవరాత్రి స్పెషల్స్

మొదటి రోజు      -       బాలా త్రిపుర సుందరి     -  పులిహోర  
రెండవరోజు           -          గాయత్రీ దేవి         - ధధొజ్యనం 
మూడవ రోజు         -         అన్న పూర్ణ       -      చక్రపొంగలి 
నాలుగవరోజు       -        లక్ష్మీదేవి               -   క్షీరాన్నం 
ఐదవ రోజు     -           లలితా దేవి    -           అప్పాలు 
ఆరవ రోజు      -           సరస్వతీ దేవి    -          గారెలు
ఏడవ రోజు       -          కాళరాత్రి దుర్గాదేవి  -     బూరెలు 
ఎనిమిదవ రోజు   -   మహిషాసుర మర్ధిని       - బొబ్బట్లు 
తొమ్మిదవ రోజు    - రాజరాజేశ్వరి      -   పులిహోర - గారెలు -  ఆవడలు 
ఇవి నవరాత్రి  స్పెషల్స్ 

Thursday, 8 September 2016

అమ్మవారి పాట

శ్రీ లలితా  శివ జ్యోతి సర్వకామదా 
శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా        " శ్రీ "
జగమున చిరునగవున పరిపాలించే జననీ 
అనయము మమ్ము కనికరమున కాపాడె జననీ 
మనసే నీవశమిమై స్మరణే  జీవనమై     " మనసే"
మాయని వరమీయవే మము బ్రోవవె మంగళ నాయకి     " శ్రీ "
అందరి కన్నా చక్కన తల్లికి సూర్య హారతి 
అందాలేలే  చల్లని తల్లికి  చంద్రహారతి      " అంద "
రవ్వల తళ్ళుకుల కళలా జ్యోతుల కర్పూర హారతి 
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి   "శ్రీ "

అమ్మవారి పాట

చూ డరమ్మ సతులార శోభాన పాడరమ్మా
కూడున్నది పతి చూడి కుడుత నాంచారీ          " 2"
శోభానే శోభానే శోభానే                      "చు "
శ్రీ మహాలక్ష్మి యట శింగారాలకె మరుదు
కాముని తల్లియట  చక్క దనాలకే  మరుదు         "2"
సోముని  తోబుట్టువట సోంపు కళలకే  మరుదు

కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి         "చూడ "
కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజ నివాసినియట చల్లదనమే మరుదు
కొలది మీర ఈ చూడి కుదుత నాంచారి         "చూడ "
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
శోభానే శోభానే శోభానే 

అమర వందియట అట్టే మహిమ ఏమరుదు
అమృతము చుట్ట ముట ఆనందాలకే మరుదు
తమతో శ్రీ వెంకటేశు తనే వచ్చి పెండ్లాడె
కొమెర వయసు ఈ చూడి కుడుత నాంచారి      " చూడ "

సాయి బాబా పాట

బోయల్లరా  ఎవరండి మా పల్లకీలోన 
ఎవరో ఏమిటో తెలియదయా 
మీరె మాకు తెలుపురయా     "2"
ఒహో ఓహో వోం               "2"
పక్కా పకీరు లా వున్నాడు 
హుక్కా  పీలుస్తున్నాడు        "2"
మహా రాజులా కుర్చొనాడు 
నవ్వుతూ మనలని చూస్తున్నాడు        "2"
"బొయల్లార "
ఒహోం ఒహోం హోం 
ఆరుడుగుల  పొడుగున్నాడు  
దివ్య వెలుగుతో వస్తున్నాడు      "2"
మక్కా మసీదు నందున్నాడు 
ఇప్పుడు ఇక్కడ కనిపించాడు       "2"
"బోయల్లార "
ఒహోం ఒహోం వోం 
చొక్కా చిరిగి పోయిన కాని 
చుకై వెలిగి పోతున్నాడు           "2"