Thursday, 8 September 2016

అమ్మవారి పాట

శ్రీ లలితా  శివ జ్యోతి సర్వకామదా 
శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా        " శ్రీ "
జగమున చిరునగవున పరిపాలించే జననీ 
అనయము మమ్ము కనికరమున కాపాడె జననీ 
మనసే నీవశమిమై స్మరణే  జీవనమై     " మనసే"
మాయని వరమీయవే మము బ్రోవవె మంగళ నాయకి     " శ్రీ "
అందరి కన్నా చక్కన తల్లికి సూర్య హారతి 
అందాలేలే  చల్లని తల్లికి  చంద్రహారతి      " అంద "
రవ్వల తళ్ళుకుల కళలా జ్యోతుల కర్పూర హారతి 
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి   "శ్రీ "

No comments:

Post a Comment