Thursday, 8 September 2016

అమ్మవారి పాట

చూ డరమ్మ సతులార శోభాన పాడరమ్మా
కూడున్నది పతి చూడి కుడుత నాంచారీ          " 2"
శోభానే శోభానే శోభానే                      "చు "
శ్రీ మహాలక్ష్మి యట శింగారాలకె మరుదు
కాముని తల్లియట  చక్క దనాలకే  మరుదు         "2"
సోముని  తోబుట్టువట సోంపు కళలకే  మరుదు

కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి         "చూడ "
కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజ నివాసినియట చల్లదనమే మరుదు
కొలది మీర ఈ చూడి కుదుత నాంచారి         "చూడ "
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
శోభానే శోభానే శోభానే 

అమర వందియట అట్టే మహిమ ఏమరుదు
అమృతము చుట్ట ముట ఆనందాలకే మరుదు
తమతో శ్రీ వెంకటేశు తనే వచ్చి పెండ్లాడె
కొమెర వయసు ఈ చూడి కుడుత నాంచారి      " చూడ "

No comments:

Post a Comment