Tuesday, 11 September 2018

శ్రీశైల రగడ

శ్రీరమ్యంబుగ శ్రీగిరియాత్రకు  , కూరిమి సతితో కూడి నడిచితిని
పల్లెలు పురములు పట్టణంబులు, పేటలుదాటితి, అడవులు కొండలు అన్నీ దాటితి
కంటిని శ్రీగిరి కన్నుల నిండా।వింటిని మహిమలు వీనులనిండా
ఆమహిమలు నేనేమని చెప్పదు,ఆమహిలోపలఎన్నడు చూడము
ధారుణి లోపల ధౌతాచలమది, మేరుని కంటెను మిక్కుటమైనది
బ్రహ్మనిర్మల బృహిశృంగబులు ,నిర్మలమగు మణిక్య కూటములు
కోటలుకొమ్మలు గోపురంబులు, తెరపి లేని బహుదేవాలయములు
పుణ్యస్ధలంబులు, పుణ్యవనంబులు, వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మంచి మృగంబులు, కామథేనువులు కల్పవృక్షములు
క్షేమ కరంబగు చింతామణులు,అమృతగుండంబులు
కడునైష్టకమును కలిగిన విప్రులు, విడువక శంభునివేడెటి రాజులు
సంతత లింగార్చన గలశైవులు, శాంతులైన వేదాంతసిద్ధులు
ఘనఘనమ్రోగెటి ఘంటానాదములు ,విజయఘోషయగు శంఖానాదములు
వీరశైవులువీరాంగంబులు, సాథు బృందములుకామిత భక్తులు ,అగరుధూపములు
జపములు చేసెటి జంగమోత్తములు, తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమధులు భక్తులుశైవగణంబులు , గట్టిగ ఇదిభూకైలాశమ్మని
తప్పిపోక పాతాళ గంగలో, తెప్పునతేలుచు తీర్ధంబాడుచు
చెలగుచు మడివస్త్రంబులుకట్టితి , అనువుగ నుదుట విభూతిధరిస్తిని
పొలుపుగ మెడరుద్రాక్షలు దాల్చితి , గురుకటాక్షమును గోప్యము చేసితి
గురుమంత్రంబునుజపమును చేసితి , అకలంకుడనైఆశజయిస్తిని
శివపంచాక్షరి మనసున నిలిపితి, శివతత్వము పరిశీలన చేసితి
పంచేంద్రియంబులు పదిలము చేసితి , పంచ ముద్రలభ్యాసము చేసితి
అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మనాదమువింటిని , లోపల తుమ్మెద నాదము వింటిని
వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు, ఆలోపలదీపము కంటిని
ఈవల చంద్రుండావల సూర్యుడు, కలిగిన స్థావరమైననిదానము కంటిని
కంటికి ఇంపగు పండు వెన్నెల, విరిసినషట్కమలంబులు, షట్తలంబులు, పిండాండములో బ్రహ్మాండముకంటిని
అంతట అక్కడ చెంగల్వ కొలనులో , ఆడుచున్నరాచహంసను పట్టితి
చాలవేయి స్తంభాలమేడలో, బాలిక కూడుకుకేళిసలిపితిని
మల్లికార్జునిని మదిలో దలచితి , ముందర బృంగికిమ్రొక్కితిని
నందికేశ్వరుని నమ్మిభజించితి,చండీశ్వరునకు దండము పెట్టితి
మళ్ళీమళ్ళీ మహిమను పొగడుచు , పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి
ద్వారపాలకుల దర్శన మాయను, ద్వారమందు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లింగము ,చూచితి కేవల సుందర లింగము
నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆదితేజ్యమగుఐక్యలింగం
రాజితమైన విరాజిత లింగం,పూజ్యనీయమగుపురాణ లింగం
లింగము కనుగొని లింగ దేహినై , లింగాంగులలో లింగ నిర్గుణ సంగతి కంటిని
లింగమందు మది లీనముచేసితి , జీవన్ముక్తుడనైతిని
అంకమందు బ్రమరాంబిక ఉండగా, మల్లికార్జునిని కోరి పూజించితి
దీపము పెట్టితి దివ్య దేహునకు ,ధూపమువేసితి ధూర్జటికప్పుడు
తుమ్మిపూలతోపూజిస్తిని, కమ్మని నైవేద్యముపెట్టితి
సాగిలిమ్రెుక్కితి సర్వేశ్వరునకు,జయజయజయజయ జంగమరాయ
ఆదిదేవుడవు ఆత్మ శరణ్య, దయతప్పకధవళ శరీర, భయము బాపు మీభక్తనిదాన
ఎన్నిజన్మములు ఎత్తినవాడను, నిన్ను తలంపకనీచుడనైతిని
ఎన్నడు ఏవిధమెరుగనివాడను,దుష్టమానసడ గౌరీరమణ
తామస గుణములు తగులాటంబలు, నియముతప్పిన నీచవర్తనుడ, నిత్యదరిద్రుడ అత్యాశయుడను  అజాఞన పశువువు
చేయరాని దుశ్చ్టేష్టలు చేసితి, బాయరాని మీభక్తులబాసితి
సంసారంబను సంకెళ్ళలో, హింసపెట్టమిక ఏలుమి తండ్రి
ముల్లోకంబులు ముంచెడి గంగను,సలలితముగాజడధరియుిస్తిని
గొప్ప చేసినిన్నుకొలచిన బంటును, తప్పకచంద్రునితలధరియిస్తిని
విన్నునిచేతను కన్నుపూజగొని సన్నుతి కెక్కిన చక్రమిచ్చితివి
ఆనకశైలకుమారిక కోరిన, సగము శరీరము ఇస్తిని
మూడులోకముల ముఖ్యమునీవే, మూడుమూర్తులకు మూలము నీవే
దాతవు నీవే, భ్ర్రాతవు నీవే,తల్లివి నీవే, తండ్రివి నీవే , బ్రహ్మము నీవే , సర్వము నీవే
పాలముంచుమిక నీటముంచుమి , పాలబడితనో ఫాల లోచన అనుచుప్రణతులనిడుచు ఇదిచదివిన వారికి .
ఫలశ్రుతి:
కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి
పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి
పాలు తీసి అభిక్షేకము చేసిన ఫలము 
ఆకలితో నున్న అన్నార్తులకును
కమ్మనీ భోజనంబిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును
శరణిచ్చి రక్షంచు విశేష ఫలము 

అంత కన్నా ఫలము అధికమయ్యుండు .

Thursday, 22 February 2018

సుందర కాండ నిత్య పారాయణ ము

31).    సీతమ్మ ను శ్రీరామునికిచ్చె
        రాముని శరణము వేడుమనె
       రామ దూతగా  వచ్చితినన్న
       హనుమంతుని హతమార్చుమనె.                  ।। సుం।। 

32).    దూతను చంపగ పాపమనుచును 
         విభీషణాదులు  తెల్పగను
         వానరములకు   ప్రియమైన
         తోకను కాల్చగ నియమించె                           ।। సుం।।

33).      రాక్షసులంతట నూనె చీరలను
           తోకకు  చుట్టి    అంటించి
            వీధులయందున  త్రిప్పుచునుండ
            ఇండ్లను తోకతో    అంటించె                    ।। సుం।।

34).       అగ్ని ఎంతగా   ప్రజ్వరిల్లినను
            హనుమను  చల్లగ చూచెనుగా
           మైథిలి యెుక్క పాతివ్రత్యమున
           అనలుడు  ఎంతయై  చల్లబడె                     ।। సుం।।


35)        మండుచున్న  తన  వాలముతోడను
            గృహములనెన్నో     కాల్చెనుగా
           మనో జఞయైన       లంకానగరిని
            భస్మీ     పటలము     గావించె                      ।। సుం।।

36).        హా!  పుత్రా! హా! తండ్రీ   యనుచును
             చచ్చిన   వారికై  ఏ డ్చుచును 
            రాక్షసులందరు    రోదన   చేయుచు
           భయముతో    పరుగులు పెట్టిరిగా                  ।। సుం।।

37).      పవనాత్మజుడు   లాంగులాగ్రము
           సాగరమందున  చల్లార్చి
          భీభత్సముగా    నున్నలంకను 
          చూచియు     ఎంతయో   భీతిల్లీ.                    ।। సుం।।

38)     జానకీ మాత  ఎటులనున్నచో
          చూడగకోరి,  హనుమయ్య
          అతి   త్వరితముగ వనమును చేరి 
         సీతా మాతకు  ప్రణమిల్లె                               ।। సుం।।

39).     రోహిణి చంద్రుని. కలియునట్లుగ
           రాముడు  నిన్నే కలియుననె
           శ్రీరాముడు ఇక శీఘ్ర్రముగాను
          లంకా  నాథుని    చంపుననె                          ।। సుం।।

40).    సీతయు తనకు ప్రియము చేసిన
          హనుమను    అలసట    తీరగను
          ఎందైనను     ఆరాత్రిని    గడిపి
          మరలి పొమ్మని    తెలిపెనుగా                         ।। సుం।।

41)       అవలీలగా ఆ సంద్రము దాటి
            మిత్రుల  చేరెను మారుతియు 
           మధువనిలోని  మధువులు త్రాగి
           రాముని చెంతనే    నిలచిరిగా                        ।। సుం।। 

42)       అంతట మారుతి   సీత   క్షేమమును
           యథాతథముగా      వినిపించి
           జానకి యుిచ్చిన    చూడామణిని
           రఘురామునికి     అందించె                          ।।సుం।।

43)      చూచిరమ్మనిన    కాల్చివచ్చిన
            ఘనతయె  నీకు   దక్కెనుగ
             హనుమయ్య ! నీసాటెవరనుచు
             సుగ్రీవాదులు    కీర్తించే                                 ।। సుం।। 

44).       మా ఇలవేల్పు   మారుతియే కద 
             తప్పులు క్షమించ   కోరుదును
             మారుతి  కిదియే  అంకితమనుచును
             మంగళహారతి   పాడెదను                           ।। సుం।।

45).       రఘురాముని నీ   మనమునునిలిపిన
             మారుతి    నీకిదె     మంగళము 
              నీ  దాసులలో  నన్ను    చేర్చగను
             మరి మరి  నిన్నే   కోరెదను                              ।। సుం।।





Sent from my iPad

నిత్య పారాయణ సుందరకాండ బృందావన మది స్టైలులో

1)   సుందరమైనది  సుందరకాండ
సుందరమెంతో సుందరము
మారుతి విజయము మరిమరి వినగ
మనస్సే పరవశ  మెుందునుగా                     ।। సుం।।

2)   సుగ్రీవుండను వానరరాజు
శ్రీరాముని ప్రియ మిత్రుండు
సీతను  వెతుకగ నలుదిక్కులకు
వానర  సేనను పంపెను గా                           ।। సుం।।


3)    నలుడు, నీలుడు, జాంబవంతుడు
జాతీ సుతుడగు  అంగదుడు
హనుమంతుని వెంటరాగా
దక్షిణ దిక్కుగ పయినిం చే                               ।।  సుం।।

4)     శత యెూజనముల  విస్తీర్ణముకల
సంద్రము నెట్టుట దాటుదుము ?
జానకి నెట్టుట చూచెద ?మనుచు
దు:ఖమునొందిరి  కపివరులు.                       ।। సుం।।

5)       అతి భీకరమగు, సంద్రము దాటగ
 అంజని సుతునకె, తగుననుచు
ఉత్సాహంబును కలుగ జేసిరి
 హనుమను అందరు కీర్తించి                        ।।సుం।।


6)     ఆంజనేయుడా మహేంద్ర గిరిని
కర, చరణంబుల మర్ధించి
దేహము పెంచే అతి వేగంబున
ఆకాశమున  విహరించే                                     ।।సుం।।

7 ).    కృతయుగంబున పర్వతంబులు
 రెక్కలు కలిగి గగనమున
విహరించుచు భయ బ్రాంతులుగొల్పగ
మునులా ఇంద్రుని ప్రార్ధించే.                             ।। సుం।।

8).      దేవరాజు తనవజ్రాయుధముతో
 అన్నింటి  రెక్కలు ఖండింప
 మైనాకంబను,గిరిరాజంబును
వాయు దేవుడు కాపా డే                                  ।। సుం।।

9).    పాతాళంబున వశించు దనుజులు
 పై  లోకములకు, రాకుండా
 అడ్డుగ , నిలచినఆమైనాకుని
సాగరుడంతట పిలిచెనుగా.                            ।। సుం।।

10).  మారుతి మనకు ఆత్మబంధువు
 అతనిని  సన్మానింపుమన
 అలసట తీరగ,  నాపై నిలుమని
ఎదురుగ నిలచెను గిరిరాజు                                ।।సుం।।

11).     అనిల కుమారుడు ఆనందించి
  జానకి  మాతను, చూచిన కానీ
  విశ్రమించననీ,  బయలుదేరగా
  సంతసించిరా  దేవతలు                                  ।। సుం।।

12).      మునులంతా ఆ పవనాత్ముజుని
    దీక్షను పరీక్ష     చేయగను
    నాగజనని  ఆ సురసా దేవిని
     ప్రార్దన  చేసి పంపిరిగా                                    ।। సుం ।।

13)        వికృత రూపము, దాల్చిన సురస
      గుహవలె నోటిని తెరచెనుగా
      నోటిని   దాటిపోలే  రెవరని
     హనుమకు అడ్డుగనిలెచెనుగా                          ।। సుం।।

14).       సూక్మ రూపమును ధరించి  మారుతి
        సురసా  నోటిలో    చొచ్చుకొని
        అతి  వేగంబున బయలు వెడలగా
       గంధర్వాదులు, హర్షించే                                 ।। సుం।।

15)          మేని   నీడనుపట్టి  లాగెడి
        సింహక యనెడు    రక్కసిని
       సంహరించి  ఆ సమీరసుతుడు
      సాగర  తీరము  చేరెను గా                                  ।। సుం।।

16)          త్రికూట పర్వత శిఖరము నున్న
          లంకను చేరి లంకిణి ని
          జయుించి  హనుమ సూక్ష్మరూపియై
          రావణ   గృహమును  వెదకెనుగా                   ।। సుం ।।

17).         మేడలు, మిద్దెలు విమానములను
        అంత:పురములు   హర్ష్యములు
        భవనంబులను  వెదకిన  హనుమ
        జానకి    జాడను  కనడయ్యె.                              ।।సుం।।

18).         అశోక  వనిలో  వృక్షము క్రిందను
         రక్కసి    మూకల మధ్యనను
         చిక్కినను బహు  చక్కగ నున్న
         సీతా  మాతను     చూచెనుగా                            ।। సుం।।

19)        అతి దుఃఖతయగు ఆవైదేహిని
        తననే వరించి  చేరుమని
        బాధించెడు ఆరావణుడంత
         చూచెను ,వృక్షము పైనుండీ                                 ।।సుం।।

20).       రాణులు ధర్మములెన్ని  చెప్పినను,
           రావణుడేమి  వినకుండే
            మనస్సు మార్చుకొను సీతమ్మకు ఒక
             రెండు  మాసములు  గడువిచ్చె                           ।। సుం।।

21)            రాక్షస వనితలు  కఠినపు మాటల
              రాముని   సతినే   బాధింప
              త్రిజట యనెడు ఒక  రాక్షస వనిత
               స్వప్నము కాంచితి నని  తెలిపె.                           ।। సుం।।

22).             లంకా  నాధుని  అపజయంబును
                 రామ చంద్రుని    విజయమును
                  కలగాంచితి ననె సీతామాతకు
                  శుభ శకునంబులు  మెుదలయ్యె.                        ।। సుం।।

23).                రామ , లక్ష్మణుల గుణరూపములను
                   గానము  చేసి   హనుమయ్య
                   రామ  దూతనని  విదేహ పుత్రిని
                    నమ్మించగ   నిజరూపుని  నిలచే                        ।। సుం ।।

24)                   అమ్మా ! రాముడు నీవిరహమున
                       అన్న  పానములు లేకుండా
                       అతి దుఃఖతుడై  ఈ ఉంగరమును
                        నీకివ్వగ నును     పంపెననె                             ।। సుం।।

25 ).                   హనుమ పలుకులు  విన్న జానకి
                         ఆనందముతో      మునిగెనుగా
                          సాగర లంఘన  చేసిననీవు
                          మహాను భావుడవని  పొగిడే.                         ।। సుం।।

26).                       సుగ్రీవాది   వానర సేనతో
                            లంకను   చేరి   రావణుని
                            సంహరించి నను చేరతీయమని
                             రామ చంద్రునకు      తెల్పమనె.                    ।। సుం।।

27).                          సీతమ్మయు  తన గుర్తు కొరకును
                               కాకా    సురుని   కధ తెలిపి
                                చూడామణి   శ్రీ రామునకు
                                అందచేయమని   పలికెనుగా                      ।। సుం।।

28 ).                          అంజని సుతుడగు  ఆనందముతో
                                వృక్షము   లన్నిటి    విరచెనుగా
                                అశోక వనిని  ధ్వంసముచేసి
                                 రావణు సేనల వధియించె                          ।। సుం।।

29)                              రావణ సుతుడగు   అక్ష కుమారుని
                                 మంత్రి   పుత్రులను    కింకరులన్
                                 వధియించిన ఆ వాయు పుత్రుడు
                                 మేఘనాథునితో      తలపడెను.                    ।। సుం।।

30)                              మేఘ నాథుడు      బ్రహ్మస్త్రంబున
                                  మారుతినప్పుడు.    బంధించీ
                                  రావణ సభలో        చేర్చినంతైనే
                                  రావణుడెంతయె      మండిపడే                    ।। సుం।

31).                           సీతమ్మను      శ్రీరామునికిచ్చె
                                  రాముని  శరణము  













Sent from my iPad


Sent from my i