31). సీతమ్మ ను శ్రీరామునికిచ్చె
రాముని శరణము వేడుమనె
రామ దూతగా వచ్చితినన్న
హనుమంతుని హతమార్చుమనె. ।। సుం।।
32). దూతను చంపగ పాపమనుచును
విభీషణాదులు తెల్పగను
వానరములకు ప్రియమైన
తోకను కాల్చగ నియమించె ।। సుం।।
33). రాక్షసులంతట నూనె చీరలను
తోకకు చుట్టి అంటించి
వీధులయందున త్రిప్పుచునుండ
ఇండ్లను తోకతో అంటించె ।। సుం।।
34). అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను
హనుమను చల్లగ చూచెనుగా
మైథిలి యెుక్క పాతివ్రత్యమున
అనలుడు ఎంతయై చల్లబడె ।। సుం।।
35) మండుచున్న తన వాలముతోడను
గృహములనెన్నో కాల్చెనుగా
మనో జఞయైన లంకానగరిని
భస్మీ పటలము గావించె ।। సుం।।
36). హా! పుత్రా! హా! తండ్రీ యనుచును
చచ్చిన వారికై ఏ డ్చుచును
రాక్షసులందరు రోదన చేయుచు
భయముతో పరుగులు పెట్టిరిగా ।। సుం।।
37). పవనాత్మజుడు లాంగులాగ్రము
సాగరమందున చల్లార్చి
భీభత్సముగా నున్నలంకను
చూచియు ఎంతయో భీతిల్లీ. ।। సుం।।
38) జానకీ మాత ఎటులనున్నచో
చూడగకోరి, హనుమయ్య
అతి త్వరితముగ వనమును చేరి
సీతా మాతకు ప్రణమిల్లె ।। సుం।।
39). రోహిణి చంద్రుని. కలియునట్లుగ
రాముడు నిన్నే కలియుననె
శ్రీరాముడు ఇక శీఘ్ర్రముగాను
లంకా నాథుని చంపుననె ।। సుం।।
40). సీతయు తనకు ప్రియము చేసిన
హనుమను అలసట తీరగను
ఎందైనను ఆరాత్రిని గడిపి
మరలి పొమ్మని తెలిపెనుగా ।। సుం।।
41) అవలీలగా ఆ సంద్రము దాటి
మిత్రుల చేరెను మారుతియు
మధువనిలోని మధువులు త్రాగి
రాముని చెంతనే నిలచిరిగా ।। సుం।।
42) అంతట మారుతి సీత క్షేమమును
యథాతథముగా వినిపించి
జానకి యుిచ్చిన చూడామణిని
రఘురామునికి అందించె ।।సుం।।
43) చూచిరమ్మనిన కాల్చివచ్చిన
ఘనతయె నీకు దక్కెనుగ
హనుమయ్య ! నీసాటెవరనుచు
సుగ్రీవాదులు కీర్తించే ।। సుం।।
44). మా ఇలవేల్పు మారుతియే కద
తప్పులు క్షమించ కోరుదును
మారుతి కిదియే అంకితమనుచును
మంగళహారతి పాడెదను ।। సుం।।
45). రఘురాముని నీ మనమునునిలిపిన
మారుతి నీకిదె మంగళము
నీ దాసులలో నన్ను చేర్చగను
మరి మరి నిన్నే కోరెదను ।। సుం।।
Sent from my iPad
రాముని శరణము వేడుమనె
రామ దూతగా వచ్చితినన్న
హనుమంతుని హతమార్చుమనె. ।। సుం।।
32). దూతను చంపగ పాపమనుచును
విభీషణాదులు తెల్పగను
వానరములకు ప్రియమైన
తోకను కాల్చగ నియమించె ।। సుం।।
33). రాక్షసులంతట నూనె చీరలను
తోకకు చుట్టి అంటించి
వీధులయందున త్రిప్పుచునుండ
ఇండ్లను తోకతో అంటించె ।। సుం।।
34). అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను
హనుమను చల్లగ చూచెనుగా
మైథిలి యెుక్క పాతివ్రత్యమున
అనలుడు ఎంతయై చల్లబడె ।। సుం।।
35) మండుచున్న తన వాలముతోడను
గృహములనెన్నో కాల్చెనుగా
మనో జఞయైన లంకానగరిని
భస్మీ పటలము గావించె ।। సుం।।
36). హా! పుత్రా! హా! తండ్రీ యనుచును
చచ్చిన వారికై ఏ డ్చుచును
రాక్షసులందరు రోదన చేయుచు
భయముతో పరుగులు పెట్టిరిగా ।। సుం।।
37). పవనాత్మజుడు లాంగులాగ్రము
సాగరమందున చల్లార్చి
భీభత్సముగా నున్నలంకను
చూచియు ఎంతయో భీతిల్లీ. ।। సుం।।
38) జానకీ మాత ఎటులనున్నచో
చూడగకోరి, హనుమయ్య
అతి త్వరితముగ వనమును చేరి
సీతా మాతకు ప్రణమిల్లె ।। సుం।।
39). రోహిణి చంద్రుని. కలియునట్లుగ
రాముడు నిన్నే కలియుననె
శ్రీరాముడు ఇక శీఘ్ర్రముగాను
లంకా నాథుని చంపుననె ।। సుం।।
40). సీతయు తనకు ప్రియము చేసిన
హనుమను అలసట తీరగను
ఎందైనను ఆరాత్రిని గడిపి
మరలి పొమ్మని తెలిపెనుగా ।। సుం।।
41) అవలీలగా ఆ సంద్రము దాటి
మిత్రుల చేరెను మారుతియు
మధువనిలోని మధువులు త్రాగి
రాముని చెంతనే నిలచిరిగా ।। సుం।।
42) అంతట మారుతి సీత క్షేమమును
యథాతథముగా వినిపించి
జానకి యుిచ్చిన చూడామణిని
రఘురామునికి అందించె ।।సుం।।
43) చూచిరమ్మనిన కాల్చివచ్చిన
ఘనతయె నీకు దక్కెనుగ
హనుమయ్య ! నీసాటెవరనుచు
సుగ్రీవాదులు కీర్తించే ।। సుం।।
44). మా ఇలవేల్పు మారుతియే కద
తప్పులు క్షమించ కోరుదును
మారుతి కిదియే అంకితమనుచును
మంగళహారతి పాడెదను ।। సుం।।
45). రఘురాముని నీ మనమునునిలిపిన
మారుతి నీకిదె మంగళము
నీ దాసులలో నన్ను చేర్చగను
మరి మరి నిన్నే కోరెదను ।। సుం।।
Sent from my iPad
No comments:
Post a Comment