శ్రీమంతునింటిలో పుట్టి - శ్రీమంతునింటిలో మెట్టి
గన్నేరు పూవులు తెచ్చి - గౌరికి సేవలు చేసి
అత్త మామలు పట్ల సేవ - ఒద్దిక కలిగి నీవు వుంటె
పుట్టినింటికి కీర్తిని తెస్తే- మెట్టినింటికి కీర్తిని తేస్తే
ప్రేమ సారెలు నీకు పెడుదు -మాఅమ్మ లక్ష్మీ దేవి పొయిరావమ్మా
మా తల్లి లక్ష్మీదేవి - మళ్ళీ రావమ్మా
పడకటింటికి అందమైన - పట్టెమంచం పరుపులిత్తు - పన్నీట దిండులిత్తు

జిగినీజిగింబ్రాలిత్తు - జవనిండు రత్నాలిత్తు
కోటి సూర్య కాంతులు మెరయ -అల్లారు ముద్దు ఓలె అమ్మా నిన్ను అంపె గానీ
మా అమ్మ లక్ష్మీదేవీ పొయిరావమ్మా - మా తల్లీ లక్ష్మీదేవీ మళ్ళి రావమ్మా
పాటించిన దీపావళి పండుగ - పదినాళ్ళునంది నాటికే తోలుక వత్తు
కాటుక కాయలిత్తు - కరకంచు చీరలిత్తు
జిగినీ జిగింబ్రాలిత్తు - జవనిండ రత్నాలిత్తు. " కోటిసూర్య "
పోయిరామా తల్లి పోయిరావమ్మా - పోయి నీ అత్తింటి బుధ్ధి కలిగిండు
ఎవ్వరేమన్ననూ ఎదురాడబోకు - మామ ఎమన్ననూ మళ్ళాడ బోకు
ఇరుగుపొరుగు ఇండ్ల్లకు - తిరుగవద్దమ్మా -పలు మార్లు పల్లెత్తి నవ్వకేఅమ్మా
వీధిని తలవిడిచి ముడవకేయమ్మా - చింతామణి నేను పొయి వచ్చెద
శ్రీ కృష్ణవేణమ్మా దయఉంచవమ్మా - అన్నపూర్ణ నేను పోయి వచ్చెద
పరంజ్యోతి పరంజ్యోతి - దయ ఉంచమ్మా.
Sent from my iPad
Sent from my iPad