Sunday, 4 October 2015

అమ్మవారిపాటలు



అమ్మా  అమ్మా రావమ్మా - మహలక్ష్మీ దయ సేయమ్మా 
తొమ్మిది రోజుల పంvడుగిదీ -తోయజ నేత్రీ రావమ్మా.         " అమ్మా " 
నీ పండుగలే చేసితిమీ - నిన్నె మదిలోకొలచితిమీ 
మమ్ముల బ్రోవుగ రావమ్మా  - మహలక్ష్మీ దయసేయమ్మా.    " అమ్మా "
రాక్షస భాదలు పడలేక - దేవతలంతా మొరలిడగా 
మహిషాసురునీ చంపితివీ - మానవ కోటిని కాచితివీ.           " అమ్మా "
సప్తమినాడు కాళివిగా - అష్టమి నాడు. దుర్గవిగా 
నవమీనాడు నళి నాక్షివి గా - దశమినాడు జయమొందితివీ.     " అమ్మా "
కుంకుమపూజలు చేసితిమీ - కువలయనేత్రీ రావమ్మా 
అనసూయా దయగనవమ్మా - హారతి గైకొన రావమ్మా.           " అమ్మా " 


Sent from my iPad

No comments:

Post a Comment