Tuesday, 6 October 2015

అమ్మవారిపాట

ఎట్లా నినెత్తుకొందునమ్మా - వరలక్ష్మీతల్లీ 
ఎట్లా నినేత్తుకొందునమ్మా.                                     "ఎట్లా "
ఎట్లా నినెత్తుకొందు - ఆట్లాడె బాలవు నీవు 
ఇట్లా రమ్మనుచూ పిలిచి - కోట్లా ధనమిచ్చే తల్లీ.       " ఎట్లా " 
పసిబాలవైతె. ఎత్తూకొందు - వరలక్ష్మీ తల్లీ 
పసిడి బుగ్గల పాలవెల్లి                                    "  పసి " "ఎట్లా "
పువ్వులు పండ్లూ. తోరణములతో. పాలవెల్లి 
కట్టిన వేదికపై.                                                "2 "
కాలి అందియలు ఘల్లని మ్రోగగ. కలహంస 
నడకలతో రామ్మా.                                           " 2"   "ఎట్లా " 
వేయీ నామముల కల్పవల్లీ - వేమారు మాకై
సాయమై  యుండుమూ ఓ తల్లీ 
సామ్రజ్య- జననీ మా పైకరుణ కలిగియుండి 
ఆయుర్    ఐశ్వర్య్ సంపదలు ఇచ్చేటి తల్లీ.               " ఎట్లా " 









Sent from my iPad

No comments:

Post a Comment