Thursday, 15 October 2015

బ్రతుకమ్మ పూజ పాట

శీమ కాశి సుందరమ్మ - చిత్తగించు. వేడుకొందు 
బాగుగ నీ పాదములకు - కోరి  సేవల్ చేసెమమ్మా 
మెత్తనీ ఆ కస్తూరి తెచ్చి - మే నలుగు పెట్టేమమ్మా 
వెండీ ఆ గంగాళంలో - వేడి నీళ్ళు తోడేమమ్మా 
పగిడీ ఆ గంగాళములో - చల్ల నీళ్ళు తోడేమమ్మా 
ఈ నీళ్ళు ఆ నీళ్లు సమముగాను - చేసేమమ్మా 
ముత్యాల చెంబుతోటి - ముంచి జలకములు ఆడేమమ్మా      "  శీమ "

పగడాల చెంబుతోటి - పట్టి జలకములు ఆడేనమ్మా 
పట్టు వస్త్రములు తెచ్చి -పయి తొడలు తుడిచేమమ్మా 
చంద్ర కాళి వోళీ - చీరచెంగు జార కట్టే మమ్మా 
బాగుగా తీర్చిన - ముత్యాల రవికె తాను తొడిగేమమ్మా 
కుందనంపు ముద్దు నొసట - కుంకుమై నా  పెట్టేమమ్మా 
కాంతరో నీ కన్నుల సోగ - కాటుకైనా పెట్టేమమ్మా 
చెడెరో నీ చెక్కెళ్ళ పైన గంధమై నా పూసేమమ్మా 
ఫణితిరో నీ పాదములకు - పసుపులై నా  పూసేమమ్మా                       "శీమ "

అక్షింతలు గంధాననిన్ను పూజింతు - ఐదవతనమైనా మాకివ్వవమ్మా 
చక్కని ఐదవతనము - చల్లని కడుపు ఇచ్చి రక్షింపుము. ఈశ్వరాదేవి.    "  శీమ "


Sent from my iPad

No comments:

Post a Comment